ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ బిల్లులతో రైతులకు నష్టం తప్ప లాభం లేదు' - పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు వార్తలు

పార్లమెంటులో రైతాంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని... పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు విమర్శించారు. ఈ బిల్లుల ద్వారా రైతులకు నష్టం తప్ప.. ఒరిగేదేమీ లేదన్నారు.

pcc state secretary chintala mohan rao fires on bjp government about agriculture bills passed in parliament
ఆ బిల్లులతో రైతులకు నష్టం తప్ప లాభం లేదు: చింతల మోహన్ రావు

By

Published : Oct 14, 2020, 7:49 PM IST


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా... దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందితో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు తెలిపారు. కడప జిల్లా రాజంపేట కాంగ్రెస్ కార్యాలయంలో జరిగన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

పార్లమెంటులో రైతాంగానికి సంబంధించి భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ బిల్లుల ద్వారా రైతులకు నష్టం తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. వైకాపా, తేదేపా, జనసేన నాయకులు కేంద్రం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details