పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అల్లూరి సీతారాం స్టేడియంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్టమొదటిసారి ఏలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభాకర్ చేస్తున్న ఆగడాలను అరికట్టలేకపోయారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా కనుమరుగైందని... గుండాయిజం రాజ్యమేలుతుందని విమర్శించారు. ఏలూరు నియోజకవర్గ పరిధిలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ధీటైన నాయకులను నిలబెట్టామన్నారు. ఏలూరును జాతీయస్థాయిలో అభివృద్ధి చెందిన నగరంగా మారుస్తామన్నారు.
'రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కనుమరుగువుతోంది' - జనసేన అధినేత పవన్ కల్యాణ్
ముఖ్యమంత్రి చంద్రబాబు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న ఆగడాలను ఆరికట్టలేకపోయారని జనసేన అధినేత విమర్శించారు.
!['రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కనుమరుగువుతోంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2771730-326-6a865716-f6d9-4273-b811-81986c3f23ed.jpg)
ఏలూరు బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్
Last Updated : Mar 23, 2019, 8:46 AM IST