పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గ్రామ సర్పంచి పసుపులేటి నరసింహారావుతో పాటు అభిమానులు స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్ధలకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి చేతిలో జనసేన పార్టీ జెండా పెట్టి హ్యాపీ బర్త్ డే టూ యూ పవన్ కళ్యాణ్ అంటూ శుభాకాంక్షలు చెప్పించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది.
పవన్ పుట్టినరోజు వేడుకల్లో అత్యుత్సాహం.. విద్యార్థి చేతికి పార్టీ జెండా - pavan birthday celebrations
పవన్ పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యార్థులకు జనసేన జెండా ఇచ్చి నినాదాలు చేయించారు. విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేస్తామని.. సర్పంచ్ తో పాటు పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు పాఠశాలకు వచ్చారని, తరగతులు ముగిసిన తర్వాత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని ప్రధానోపాధ్యాయుడు యర్ర నరసింహారావు తెలిపారు.
ఈ అంశంపై ఎంఈఓ విచారణ చేపట్టారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేస్తామని సర్పంచ్ తో పాటు పలువురు అభిమానులు పాఠశాలకు వచ్చారని, తరగతులు ముగిసిన తర్వాత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని ప్రధానోపాధ్యాయుడు యర్ర నరసింహారావు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారి హెచ్చరించారు.
ఇదీ చదవండి:నరసాపురం రైల్వేస్టేషన్ అభివృద్ది పనులను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం