ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్షల ఎకరాలకు నీరందిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం - krishna delta

పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమై ఐదేళ్లు పూర్తయింది. ఈ ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల నీటిని ఎత్తిపోసి...లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. ప్రస్తుతం ఐదో సీజన్​లో భారీగా గోదావరి జలాలను ఎత్తిపోస్తుండటం వలన రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

లక్షల ఎకరాలకు నీరందిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం

By

Published : Aug 28, 2019, 6:55 AM IST

లక్షల ఎకరాలకు నీరందిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం

గోదావరిజలాలు వినియోగించి కృష్ణా డెల్టా ఆయకట్టులో సాగునీటి కష్టాలు తీర్చడం లక్ష్యంగా రూపుదిద్దుకున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం...పనులు ప్రారంభమై ఐదేళ్లు పూర్తయింది. 2015లో ఈ పథకం ప్రారంభంకాగా.. ప్రస్తుతం ఐదో సీజన్​లో భారీగా గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఈ నీటితో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా కొన్ని వందల టీఎంసీల నీటిని ఎత్తిపోసి...లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. లక్షలాది మంది ప్రజల తాగునీటి అవసరాలు సైతం తీరుస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి జలాల సద్వినియోగంపై ఈటీవీ భారత్ ప్రతినిధి కథనం.

ABOUT THE AUTHOR

...view details