ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pattiseema Irrigation Project Good Lesson to Jagan Criticism: నాడు ప్రతిపక్షనేతగా జగన్‌ పట్టిసీమ ప్రాజెక్టుపై విమర్శలు.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టే దిక్కు అయ్యింది! - పట్టిసీమ ప్రాజెక్టు వార్తలు

Pattiseema Irrigation Project Good Lesson to Jagan Criticism: నాడు ప్రతిపక్షనేతగా జగన్‌.. పట్టిసీమ ప్రాజెక్టుపై పగడెత్తిన నాగులా బుసలు కొట్టారు. గోదావరి, కృష్ణా నదులకు రుతుపవనకాలంలోనే వరదలు వస్తాయి. నీరు ఎత్తి ఎక్కడ పోస్తారంటూ విమర్శలు గుప్పించారు. నీటిని నిల్వ చేసేందుకు జలాశయం లేకుండా ఎత్తిపోతలు నిర్మించి ఏం చేస్తారంటూ నాటి తెలుగుదేశం ప్రభుత్వంపై చిందులేశారు. కానీ ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టే దిక్కైంది. నాడు దుమ్మెత్తి పోసిన పథకమే నేడు నీరెత్తి పోయిడానికి ఉపయోగపడుతోంది.

CM_Jagan_Comments_on_Pattiseema_Project
CM_Jagan_Comments_on_Pattiseema_Project

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 9:07 AM IST

Pattiseema Irrigation Project Good Lesson to Jagan Criticism :తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015లో పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణానికి పాలనామోదం ఇచ్చినప్పుడు శాసనసభలో జరిగిన చర్చలో జగన్‌ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. ఎక్కడా నీటిని నిల్వచేసేందుకు జలాశయం లేకుండా పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించి ఏం చేస్తారు? ఇదేం ప్రాజెక్టు.. అంటూ విమర్శించారు. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వంలోనే పట్టిసీమ ఎత్తిపోతల నుంచి ఈ ఏడాది 34.5 టీఎంసీల గోదావరి వరద జలాలను కృష్ణాకు తరలించారు. కృష్ణా ఆయకట్టు కాపాడేందుకు పట్టిసీమే దిక్కయింది. పులిచింతల బ్యాలెన్సింగ్‌ జలాశయంలో నీళ్లు నిల్వ ఉండి, పట్టిసీమ నుంచి కొంత నీరు తీసుకొస్తుంటేనే కృష్ణా డెల్టా ఆయకట్టు కటకటలాడుతోంది. అదే పట్టిసీమ లేకుంటే ఇప్పుడు ఆయకట్టు పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Lokesh selfie at PattiSeema Project : పట్టిసీమతో కృష్ణాడెల్టా రైతుల నీటి కష్టాలు తీర్చిన అపర భగీరథుడు చంద్రబాబు: లోకేశ్

నైరుతి రుతుపవన కాలంలో వర్షాలు పడి అక్టోబరు ప్రారంభానికి జలాశయాలన్నీ నీళ్లతో కళకళలాడాలి. ఈ ఏడాది కృష్ణాలో అసలు ప్రవాహాలే లేవు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు నిండలేదు. ఉన్న నీటిని జులై ప్రారంభం వరకు తాగునీటి అవసరాలకే వినియోగించు కోవాలని కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఆయకట్టులో సాగులేక అన్నదాత విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 29.9 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 29.487 టీఎంసీలు, పులిచింతలలో 29 టీఎంసీల నీళ్లే ఉన్నాయి.

CM Jagan Comments on Pattiseema Project :"పట్టిసీమ ఎత్తిపోతల నుంచి రోజుకు 8,500 క్యూసెక్కుల నీళ్లు ఎత్తిపోస్తారట.. 80 టీఎంసీలు ప్రకాశం బ్యారేజికి తీసుకొస్తారట.. ప్రత్యేక జలాశయం లేకుండా ఆ నీళ్లు తెచ్చి ఎక్కడ పెడతారు?" అంటూ నాడు జగన్‌ విమర్శించారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలోనే ఈ ఏడాది గోదావరి నుంచి ఇంతవరకు 34 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చారు. జగన్‌ సర్కారు ఏ జలాశయమూ నిర్మించలేదు. మరి నీళ్లు ఎలా తీసుకురాగలిగారు.

TDP Leaders Allegations on Jagan About Krishna Delta: ఎడారిని తలపిస్తోన్న కృష్ణా డెల్టా.. నీళ్లివ్వకపోతే ఆందోళనలు: టీడీపీ నేతలు
Jagan Criticism on Pattiseema Project in the Opposition :గోదావరి, కృష్టాకు ఓకే సమయంలో వరదలు వస్తాయి. ఆ నీరు పట్టుకొచ్చి ఎక్కడ పెడతారు? అంటూ ప్రతిపక్షనేతగా విమర్శించిన జగన్‌.... నైరుతి రుతుపవనకాలంలోనే పట్టిసీమనుంచి నీటిని ఎత్తిపోసి 34 టీఎంసీలు తెచ్చారు. మరి అవి ఎక్కడ పెట్టారు? కృష్ణాలో కరవు ఉన్నప్పుడు గోదావరి వరదనీరు ఉపయోగపడిందా లేదా? మీరు చేసింది రాజకీయ విమర్శే కదా? రాష్ట్రాభివృద్ధి ముఖ్యమా? రాజకీయాలు ముఖ్యమా? జగన్‌! అన్న విమర్శలు వస్తున్నాయి.

గోదావరి అటూ ఇటుగా 60 రోజులే పొంగుతుందని ఎంత ఘనంగా చెప్పారో జగన్‌.. ప్రస్తుతం అక్టోబరు 12న కూడా గోదావరి వరద ఉండటంతో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటిని ఎత్తిపోశారు. 20 పంపులు పని చేశాయి. 7వేల 80 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. మీరు చెప్పినట్లు గోదావరి వరద సెప్టెంబరు వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఏం చెబుతారు జగన్‌? ఇప్పటికీ పట్టిసీమ నిర్మాణం తప్పే అంటారా? ఏది మీ మాటల్లో విశ్వసనీయత? చివరికి ఏం రుజువైంది.

No Water in Krishna Delta: సాగునీరు అందక ఎండుతున్న పంటలు.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతుల అవస్థలు..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details