ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిడ్నీలో రాళ్లు తీస్తారని వస్తే ప్రాణం తీశారని ఆందోళన - Imperial Hospital latest News

కిడ్నీలో రాళ్లు తీయించుకునేందుకు వస్తే ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ప్రాణాలు తీసేశారని బంధువులు ఆందోళన చేపట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధిత ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు.

కిడ్నీలో రాళ్లు తీస్తారని వస్తే ప్రాణం తీశారని ఆందోళన
కిడ్నీలో రాళ్లు తీస్తారని వస్తే ప్రాణం తీశారని ఆందోళన

By

Published : Oct 22, 2020, 4:01 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు‌ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామానికి చెందిన సీహెచ్‌ శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.

వికటించిన శస్త్ర చకిత్స..

కిడ్నీలో రాళ్లు తొలగించేందుకు శస్త్ర చికిత్స చేస్తుంటే అది వికటించిందని బంధువులు పేర్కొన్నారు. పట్టణ రెండో టౌన్ పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పి అక్కడి నుండి పంపించారు.

చర్యలేవీ..

ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆస్పత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని బాధిత కుటుంబీకులు మండిపడుతున్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కిడ్నీలో రాళ్లు తీస్తారని వస్తే ప్రాణం తీశారని ఆందోళన

ఇవీ చూడండి : వరద బాధితులకు రామోజీ గ్రూప్‌ రూ.5 కోట్ల సాయం

ABOUT THE AUTHOR

...view details