పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో పాటెమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా... పెరుగూడెం గ్రామానికి చెందిన మహిళలు 108 కలశాలతో గ్రామోత్సవంగా బయలుదేరి... తిమ్మన్నగూడెంలో గల అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ కొలువైన దేవత యలమర్తి వారి ఆడపడుచు కావడంతో ప్రతి ఏటా పెరుగూడెం గ్రామానికి చెందిన ప్రజలు 108 కలశాలను కోవెలకు తీసుకొచ్చి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా పాటెమ్మ తల్లి ఉత్సవాలు.. 108 కలశాలతో గ్రామోత్సవం - పశ్చిమగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో పాటెమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఘనంగా పాటెమ్మ తల్లి ఉత్సవాలు