పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై చర్చి పాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 14 ఏళ్ల ఓ బాలిక చర్చికి వెళుతూ ఉంటుంది. పాస్టర్‌గా విధులు నిర్వహించే వెంకటేశ్వరరావు మార్కు.. ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలికపై అనుమానం వచ్చి తల్లిదండ్రులు వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని తేలింది. నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అవినాశ్ తెలిపారు.