ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మద్యపానంతో పేదల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి' - పశ్చిమగోదావరి జిల్లా క్రైం

మద్యం సేవించడం వల్ల పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అన్నారు. మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు.

parivarthana programme conducting in nagireddygudem west godavari distict
'మద్యపానంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి'

By

Published : Jul 11, 2020, 5:28 PM IST

మద్యపానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అన్నారు. జిల్లా ఎస్పీ నారాయణ, ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యపానం నిషేధిస్తామని ముఖ్యమంత్రి జగన్​ ఇచ్చిన హామీ అమలులో భాగంగా.. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచి, దుకాణాల సంఖ్యను తగ్గించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారని చెప్పారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగ వ్యవస్థను సృష్టించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని వెల్లడించారు.

నాటుసారా సామగ్రి స్వచ్ఛందంగా అప్పగింత

నాటు సారా తయారీ, విక్రయాలు చేసి.. క్రిమినల్ కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు జరిగే కష్ట నష్టాల గురించి ఎస్ఈబీ అదనపు ఎస్పీ కరిముల్లా షరీఫ్ వివరించారు. గ్రామంలో నాటుసారా తయారు చేస్తున్న సుమారు 50 కుటుంబాలు.. ఇక నుంచి సారా తయారీ చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించారు.

ఇదీ చదవండి:

కొవిడ్ ఆస్పత్రుల్లో ఎలాంటి సమస్యలు రావొద్దు: మంత్రి నాని

ABOUT THE AUTHOR

...view details