పశ్చిమ గోదావరి జిల్లాలో 48 జడ్పీటీసీ స్థానాలు, 863 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 2 జడ్పీటీసీ, 73 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలో ఒక జడ్పీటీసీ, 10 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు వివిధ కారణాలతో మరణించగా.. అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 45 జడ్పీటీసీ, 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఓటర్లు ఇలా..
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే పరిషత్ ఎన్నికలకు 23 ,76, 756 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 11,99,699 మంది మహిళా ఓటర్లు, 11,76,914 మంది పురుషులు, 143 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
బరిలో అభ్యర్థులు..