పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని తొలి విడత ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నరసాపురం నియోజకవర్గంలో 40 గ్రామాల్లో తొలి విడత ఎన్నికలను నిర్వహిస్తున్నారు. నరసాపురం మండలంలో 23 గ్రామాల పంచాయతీ స్థానాలకు 61 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 197 వార్డులకు 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నరసాపురంలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ - నరసాపురం పంచాయతీ ఎలెక్షన్ 2021 న్యూస్
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు.
![నరసాపురంలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ panhayati election polling at narasapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10553625-819-10553625-1612845755641.jpg)
మెుగల్తూరు మండలంలోని 17 గ్రామాల్లోని సర్పంచ్ ఎన్నికలకు 44 మంది, 139 వార్డులకి 208 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మెుత్తం 466 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుండగా... ఆయా కేంద్రాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల బందోబస్తు మరింత ఎక్కువ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 6.30 నిమిషాలకే ఓటింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఇదీ చదవండి:ముగిసిన రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ.. హోరాహోరీ పోరుకు సిద్ధం