ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఇలా...

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ఊపందుకోవడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపిక పనుల్లో నిమగ్నమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కులాల వారీగా రిజర్వేషన్ల వివరాలను అధికారులు విడుదల చేశారు.

panchayat elections reservations outed by officials
పశ్చిమగోదావరి జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు

By

Published : Jan 27, 2021, 4:17 PM IST

పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఊపందుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో సర్పంచ్ పదవులకు వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో తగిన అభ్యర్థుల ఎంపిక కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. రిజర్వేషన్ కాని స్థానాల్లో అభ్యర్థులు అవకాశం కోసం పోటీపడుతుండగా.. రిజర్వేషన్ స్థానాలలో సమర్థులైన అభ్యర్థుల కోసం పార్టీలు వెతుకుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా సర్పంచ్ రిజర్వేషన్లు:

  • షెడ్యూల్డ్​ కులాల ప్రాంతాల్లో ఎస్టీ మహిళలకు-34, ఎస్టీ జనరల్​కు-32 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
  • నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్టీ మహిళలకు-3, ఎస్టీ జనరల్​కు-1 స్థానం రిజర్వ్ అయ్యాయి.
  • ఎస్సీ మహిళలకు-108, ఎస్సీ జనరల్​కు-87 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
  • బీసీ మహిళలకు-110, బీసీ జనరల్​కు-96 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
  • ఓసీ మహిళలకు-208, ఓసీ జనరల్​కు-220 స్థానాలు ఖరారయ్యాయి.

పశ్చిమగోదావరి జిల్లా వార్డుల రిజర్వేషన్లు:

  • షెడ్యూల్ కులాల ప్రాంతాల్లో ఎస్టీ మహిళలకు-227, ఎస్టీ జనరల్​కు-195 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
  • ఓసీ మహిళలకు-100 స్థానాలు, ఓసీ జనరల్​కు-132 స్థానాలు.. మొత్తం 654 స్థానాలు షెడ్యూల్ కులాల ప్రాంతాలలో రిజర్వ్ అయ్యాయి.
  • నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్టీ మహిళలకు-46, ఎస్టీ జనరల్​కు-21 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
  • ఎస్సీ మహిళలకు-1279, ఎస్సీ జనరల్​కు-899 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
  • బీసీ మహిళలకు-1100, బీసీ జనరల్​కు-1020 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
  • ఓసీ మహిళలకు-2124, ఓసీ జనరల్​కు-2609.. మొత్తం-9098 స్థానాల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి.

రిజర్వేషన్లు ఖరారైన తరువాత మొత్తం 900 పంచాయతీల్లో నాలుగు పంచాయతీలు వివిధ మున్సిపాలిటీలలో విలీనం కావడం, ఒక పంచాయతీ నగర పంచాయతీగా మారడంతో మిగిలిన 895 పంచాయతీలకు రిజర్వేషన్ యథాతథంగా కొనసాగనుంది. విలీనమైన, నగర పంచాయతీగా మారిన పంచాయతీల పరిధిలోని 72 వార్డులు తగ్గడంతో మిగిలిన 9680 వార్డుల్లో రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఎన్నికల నియమావళిని పట్టించుకోని అధికారులు

ABOUT THE AUTHOR

...view details