ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జంగారెడ్డిగూడెంలో రైతుల ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆయిల్ పామ్ కర్మాగార యాజమాన్యం ధర విషయంలో రైతులను మోసం చేస్తోందని... అన్నదాతలు కర్మాగారం ఎదుట ఆందోళన చేపట్టారు.

west godavari district
పామ్ ఆయిల్ ఫార్మర్స్ ధర్నా

By

Published : Jun 27, 2020, 6:43 AM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆయిల్ పామ్ కర్మాగార యాజమాన్యం గిట్టుబాటు ధర కల్పించాలని... ఆయిల్ పామ్ రైతులు కర్మాగారం ఎదుట నిరసన చేపట్టారు. తెలంగాణలో టన్నుకు 9300 ధర ఇస్తుండగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో మాత్రం టన్నుకు 8500 మాత్రమే చెల్లిస్తున్నారని ఆందోళన చేశారు. రవాణా చార్జీలు కూడా ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై కర్మాగారం యాజమాన్యాన్ని కలిసేందుకు వెళ్లిన రైతులను, రైతు సంఘం నాయకులను అడ్డుకోవడం దారుణమన్నారు. కర్మాగారం కార్యాలయం ఎదుట రైతులు, రైతు సంఘం నాయకులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం వచ్చి రైతుల సమస్యలు పరిష్కారం చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయిల్ పామ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కేశవరావు తెలిపారు.

ఇది చదవండిప్రతిధ్వని: నకిలీ విత్తనాలు.. రైతులకు సాగు కష్టాలు..!

ABOUT THE AUTHOR

...view details