పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వద్ద ఒక వ్యక్తి గోదావరిలో దూకాడు. పాలకొల్లుకు చెందిన పురోహితుడు పవన్ కుమార్ ఆత్మహత్య చేసుకునేందుకు నదిలో దూకాడు. 4 నెలలుగా ఆలయం మూసివేత వల్ల పవన్ ఆదాయం కోల్పోయాడని.. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని బంధువులు చెప్తున్నారు. అతనికోసం స్థానికులు నదిలో గాలిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో గోదావరిలో దూకిన పురోహితుడు
అతనొక పురోహితుడు. దేవాలయంలో అర్చకత్వం చేస్తూ జీవిస్తున్నాడు. కరోనా కారణంగా 4 నెలలుగా ఆలయాలు మూసివేయటంతో ఆదాయం కోల్పోయాడు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరిలో దూకాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా చించినాడ వద్ద జరిగింది.
ఆర్థిక ఇబ్బందులతో గోదావరిలో దూకిన పురోహితుడు!