పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పురపాలక సంఘం కార్యాలయంలో తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు నిద్రకు ఉపక్రమించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రశ్నించేందుకు ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వస్తే ఏ అధికారి స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పురపాలక సంఘ కమిషనర్ నరసింహారావు, ప్రత్యేక అధికారిని ఎన్నిసార్లు చరవాణిలో సంప్రదించినా పట్టించుకోలేదని వాపోయారు. రాత్రి 9 గంటలైనా అధికారులెవరూ స్పందించకపోవడం వల్ల అక్కడే నిద్రకు ఉపక్రమించి తన నిరసనను తెలియజేశారు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడం వల్ల ఇప్పటి వరకూ ఐదుగురు మృతి చెందారని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు వచ్చే వరకూ తాను కార్యాలయం నుంచి కదిలేది లేదని హెచ్చరించారు.
పురపాలక కార్యాలయంలో ఎమ్మెల్యే నిరసన నిద్ర - palakollu mla protest at corporation office
పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు సమస్యను తెలిపేందుకు తెదేపా ఎమ్మెల్యే పురపాలక కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 వరకూ వేచి చూసినా ఏ ఒక్క అధికారి స్పందించలేదు. ఆగ్రహించిన ఆ ప్రజాప్రతినిధి వారు వచ్చే వరకూ కదిలేది లేదంటూ అక్కడే కూర్చున్నారు. రాత్రికి అక్కడే నిద్రకు కూడా ఉపక్రమించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పురపాలక కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.

ఎమ్మెల్యే నిరసన
అధికారులు స్పందిచలేదని తెదేపా ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసా...?