పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పురపాలిక అధికారుల తీరును నిరసిస్తూ... ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన రెండోరోజూ కొనసాగించారు. సమస్యలు విన్నవించేందుకు ఎమ్మెల్యే నిన్న పురపాలిక కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం వరకూ అధికారులు రాకపోయేసరికి నిరసన తెలుపుతూ రాత్రి అక్కడే నిద్రించారు. ఇవాళ ఉదయం అక్కడే స్నానం చేసి... తిరిగి నిరసన ప్రారంభించారు. మధ్యాహ్నం వరకూ వేచి ఉన్నా అధికారులు రాలేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవట్లేదని రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు.
రెండో రోజూ.. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన - palakollu mla nimmala ramanaidu protest infront of muncipal office
పాలకొల్లు పురపాలక కార్యాలయం ముందు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రెండో రోజూ నిరసన కొనసాగించారు. సమస్యలు విన్నవించేందుకు శుక్రవారం పురపాలిక కార్యాలయానికి వెళ్తే... సాయంత్రం వరకూ అధికారులు రాకపోయేసరికి ఎమ్మెల్యే నిరసన తెలిపారు.

రెండో రోజూ నిరసన కొనసాగించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
రెండో రోజూ నిరసన కొనసాగించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
TAGGED:
nimmala ramanaidu protest