ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా సోకిందని ఇల్లు ఖాళీ చేయించిన యజమాని - కరోనా కారణంగా ఆకివీడులో ఇంటిని ఖాళీ చేయించిన యజమాని తాజా వార్తలు

తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వృద్ధురాలికి కరోనా సోకిందని ఓ యజమాని ఆ కుటుంబాన్నే ఖాళీ చేయించారు. ఓ ఫ్లాట్‌లో ఐసోలేషన్‌లో ఉన్న కుటుంబాన్ని బయట తాళం వేసి నిర్బంధించారు మరొకరు. కరోనా కారణంగా.. మనుషలు మానవత్వాన్ని మరిచిపోతున్నారటానికి నిదర్శనాలివీ.

corona
కరోనా సోకిందని ఇల్లు ఖాళీ చేయించిన యజమాని

By

Published : Apr 21, 2021, 10:30 AM IST

కరోనా సోకిందని ఇల్లు ఖాళీ చేయించిన యజమాని

అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలికి కొవిడ్‌ సోకిందనే అనుమానంతో కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించిన అమానుష ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో వెలుగుచూసింది. ఆకివీడు పరిధి అనాలచెరువు సమీపంలో.. వృద్ధురాలు(80) తన ఇద్దరు కుమారులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు రెండ్రోజుల నుంచి అనారోగ్యంగా ఉండటంతో కొవిడ్‌ సోకిందనే భయంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని పట్టుపట్టారు. కరోనా భయంతో ఆ ప్రాంతంలో మిగిలిన వారు కూడా వారికి ఆశ్రయం ఇవ్వలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమారులిద్దరూ తమ తల్లిని సోమవారం రాత్రి రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉన్న శ్మశానవాటిక షెడ్డులో ఉంచి ఆమె బాగోగులు చూసుకున్నారు. మంగళవారం రాత్రి విషయం తెలుసుకున్న ఆకివీడు ఎస్‌.ఐ. వీరభద్రరావు.. సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి వృద్ధురాలిని తిరిగి అద్దె ఇంటికి తీసుకువచ్చారు. ఇంటి యజమానితో మాట్లాడి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్‌.ఐ. తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details