రైతుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలం శెట్టిపేటలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి భవనం, గోదాం భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల అవసరాలు తీర్చడం కోసమే రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోనికి తెచ్చామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకొని రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సహకారశాఖ అధికారులు పాల్గొన్నారు.
శెట్టి పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - MLA Srinivas visits Nidadavolu in West Godavari district
రైతుల అవసరాల కోసం రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో ప్రాథమిక వ్యవసాయ పరపతి భవనాన్ని, గోదాం భవనాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
శెట్టి పేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం