ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన ఎమ్మెల్యే - carona time special portal
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... కరోనా సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఫేస్ బుక్ పోర్టల్ ను చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. నాలుగు మండలాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కన్వీనర్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక పోర్టల్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ఎమ్మెల్యే విడుదల చేశారు. WWW.facebook.com/mlapvctp, 18005998555 నంబర్లను ప్రజలకు తెలిసేలా మీడియాకు విడుదల చేశారు.
ఇది చదవండికులాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారు: పవన్‌కల్యాణ్