పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంటకు చెందిన జి. నవీన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి బాకీ ఉన్నాడు. అందరిముందు అప్పు తీర్చమని అడగటంతో.. అవమానంగా భావించిన నవీన్ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించి కుటుంబసభ్యులు ద్వారకాతిరుమలలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడనుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందకపోవటంతో కేసు నమోదు చేయలేదని ద్వారకాతిరుమల పోలీసులు తెలిపారు.
బాకీ తీర్చమన్నందుకు... అవమానంగా భావించి.. - రాళ్లకుంట వ్యక్తి ఆత్మహత్య వార్తలు
ఆర్థిక లావాదేవీల విషయంలో జరిగిన ఘర్షణ కారణంగా ఓ వ్యక్తి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా రాళ్లకుంటలో జరిగింది.
వ్యక్తి ఆత్మహత్య