పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఉండ్రాజవరంలో తాతారావు అనే వ్యక్తి భవనం పైనుంచి దూకేస్తానంటూ హల్చల్ చేశాడు. ఇంటిపైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తనను చంపడానికి కొద్దిరోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని తాతారావు చెప్పాడు. అతనిపై ఫోక్సో కేసు ఉందనీ.. తప్పించుకోవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని జంగారెడ్డిగూడెం పోలీసులు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
'భవనంపై నుంచి దూకేస్తా'నంటూ వ్యక్తి హల్చల్ - one person created hungama in west godavari district
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఉండ్రాజవరంలో తాతారావు అనే వ్యక్తి భవనం పైనుంచి దూకేస్తానంటూ హల్చల్ చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
'భవనంపై నుంచి దూకేస్తా'నంటూ వ్యక్తి హల్చల్