ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చింతమనేనిపై మరో కేసు నమోదు - latest chinthamaneni issue news

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై కేసుల పరంపరం కొనసాగుతోంది. ఆయన్ను అరెస్టు చేసే సమయంలో మహిళా పోలీసులను నిర్బంధించారంటూ కేసు దాఖలైంది.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై కేసులు

By

Published : Sep 19, 2019, 3:41 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై మరో కేసు నమోదైంది. ఆయన్ను అరెస్టు చేసే సమయంలో మహిళా పోలీసులను నిర్బంధించారన్న ఆరోపణలతో కేసు దాఖలైంది. చింతమనేని ఇప్పటికే ఏలూరు జైల్లో ఉన్నారు. మరో కేసు నమోదైన కారణంగా.. కారాగారం నుంచి న్యాయస్థానానికి పోలీసులు ప్రభాకర్​ను తీసుకొచ్చారు.

తెదేపా కార్యకర్తల ఆగ్రహం

గతంలో చింతమనేనిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కల్పితమే అని ఫిర్యాదుదారులే స్పష్టం చేశారు. ఇంతలోనే చింతమనేనిపై మరో కేసు నమోదైన విషయం తెలిసిన తెదేపా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇవీ చదవండి

'చింతమనేనిపై పోలీసులే బలవంతంగా కేసు పెట్టించారు'

ABOUT THE AUTHOR

...view details