ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మో: 8 మందిని విషం పెట్టి చంపేశాడు - విషం పెట్టి చంపిన న్యూస్

ఓ అపార్ట్‌మెంట్‌లో రాత్రి కాపలాదారుగా పని చేశాడతను... సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నాడు... మోసాల బాట పట్టాడు. తన గురించి ఎవరైనా పసిగడితే... వారికి ఆహారంలో విషమిచ్చి చంపేవాడు. ఇలా ఎనిమిది మందిని హతమార్చినట్లు తెలిసింది. ఇటీవల ఏలూరులో జరిగిన హత్యోదంతంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

one man killer

By

Published : Oct 29, 2019, 7:35 AM IST

ఈ నెల 16న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) కాటి నాగరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మరణానికి విష ప్రయోగం కారణమని పోస్టుమార్టం నివేదిక ధ్రువీకరించింది. ఈ కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతను మరో ఏడుగురిని అంతమొందించాడని విచారణలో తెలిసింది. నిందితుడు ఏలూరులో 3, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, బొమ్మూరు పరిధిలో 4, కృష్ణాజిల్లాలో ఒకటి చొప్పున హత్యలకు పాల్పడినట్లు సమాచారం.
ప్రత్యేకతలు ఉన్న నాణేలు, రెండు తలల పాముల పేరిట పలువురిని నిందితుడు మోసం చేసేవాడు. ఈ క్రమంలో తన సంగతిని పసిగట్టిన వారిని, నమ్మకంగా వేర్వేరు చోట్లకు రప్పించి, ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో విషం పెట్టి అందించేవాడని, దానిని తీసుకున్న వారు కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు విడిచే వారని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details