వైకాపా విజయోత్సవ ర్యాలీలో ఓ వ్యక్తి ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట వైకాపా అభ్యర్థిని విజయోత్సవ ర్యాలీలో ఈ ఘటన జరిగింది. ఇర్ల విజయశాంతి ఎంపీటీసీ సభ్యురాలిగా విజయం సాధించడంతో వైకాపా నాయకులు, అభిమానులు ఆదివారం రాత్రి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ట్రాక్టర్‌పై వెంకటరామానుజపురం వెళుతుండగా అభ్యర్థిని సమీప బంధువు ఇర్ల సత్తిరెడ్డి(45) జారి కిందపడ్డారు. దీంతో వెనుక చక్రం సత్తిరెడ్డి మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై ఏ విధమైన సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు.
వైకాపా విజయోత్సవ ర్యాలీలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి - వైకాపా ర్యాలీలో వ్యక్తి మృతి
వైకాపా నిర్వహించిన పరిషత్తు ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో విషాదం జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనపై ఎటువంటి సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు.

one man died in ysrcp rally at jangareddy gudem mandal west godavari district