పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని శ్రీ సద్గురు నాగ షిరిడీ సాయి నాగ పంచాయతన క్షేత్రం నిర్వాహకులు అక్కిన లక్ష్మీనారాయణ దంపతులు... తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి రూ.లక్ష విలువైన 12 టన్నుల కూరగాయలను విరాళంగా ఇచ్చారు. దేవస్థానం నుంచి వచ్చిన ప్రత్యేక వాహనంలో ఈ కూరగాయలను పంపించారు. జిల్లా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలు పంపడం ఇదే ప్రథమమని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు.
తితిదేకు రూ.లక్ష విలువైన కూరగాయలు విరాళం - west godavari district latest news
తిరుమల తిరుపతి దేవస్థానానికి పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురం శ్రీ సద్గురు నాగ షిరిడీ సాయి నాగ పంచాయతన క్షేత్రం నిర్వాహకులు కూరగాయలు విరాళంగా ఇచ్చారు. ప్రత్యేక వాహనంలో ఈ కూరగాయలను పంపించారు.
తితిదేకు రూ.లక్ష విలువైన కూరగాయలు విరాళం