OLD WOMAN DONATION: ఆపదలో ఉంటే ఆదుకునే నాథుడే కరువైన ఈ రోజుల్లో ఓ వృద్ధురాలు తన ఔదార్యాన్ని ప్రదర్శించారు. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు కోట్ల రూపాయల విలువైన భూమిని ఆస్పత్రి నిర్మాణానికి ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు.
OLD WOMAN DONATION: వృద్దురాలి ఔదార్యం.. ఆస్పత్రికి రూ.3 కోట్ల విలువైన భూమి దానం - west godavari district latest news
OLD WOMAN DONATION: పది మందికి ఉపయోగపడే పని చేయాలన్న ఆమె తపన.. తన భర్త పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఆకాంక్ష.. ఆ వృద్ధురాలి ఔదార్యాన్ని చాటి చెప్పాయి. సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన భూమిని ఆస్పత్రి నిర్మాణానికి విరాళంగా ఇచ్చేలా చేశాయి.
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన సీతమ్మ ఆస్పత్రి నిర్మాణానికి మూడు కోట్ల రూపాయల విలువైన భూమిని విరాళంగా ఇచ్చారు. భర్త సుబ్బారావు నాలుగేళ్ల క్రితం మృతి చెందడంతో పిల్లలు లేని సీతమ్మ బంధువుల సంరక్షణలో కాలం గడుపుతోంది. ఆమెకు ఆరు ఎకరాల భూమి ఉంది. వేలివెన్నుతోపాటు చుట్టుపక్కల గ్రామాల కోసం ప్రభుత్వం 10 పడకల ఆస్పత్రి మంజూరు చేసింది. నిధులు విడుదలై నెలలు గడుస్తున్నా.. ఈ ప్రాంతంలో భూముల ధరలు అధికంగా ఉండటంతో స్థల సేకరణ సమస్యగా మారింది. ఈ విషయం తెలిసిన సీతమ్మ తన భర్త సుబ్బారావు జ్ఞాపకార్ధం సుమారు రూ.3 కోట్ల విలువైన ఎకరం భూమిని విరాళంగా అందజేశారు.
ఇదీ చదవండి: