ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోపన్నపాలెంలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం - west godavari

పశ్చిమ గోదావరి జిల్లా గోపన్నపాలెంలో సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది.

పూర్వవిద్యార్థులు

By

Published : Jul 14, 2019, 7:44 PM IST

గోపన్నపాలెంలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం

విద్యార్థి దశలోని జ్ఞాపకాలను ఒకరినకొకరు గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు... ఆ కళాశాల పూర్వ విద్యార్థులు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలలో 1986 సంవత్సరం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తమకు చదువులు చెప్పిన గురువులను ఈ కార్యక్రమంలో సత్కరించారు. కళాశాలలో తాగునీటి బోర్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వీరిలో దిల్లీలో ఏపీ రెసిడెంట్ అసిస్టెంట్ కమిషనర్​గా పనిచేస్తున్న ఆనంద్, ఏసీబీ డీఎస్పి శ్రీనివాస్, ఎస్వీఎస్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ నిరంజన్, పాస్ పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ భాష ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details