పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. మరోవైపు భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా కలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వారంతా ఘనంగా నిర్వహించారు.
ఉంగుటూరు, భీమడోలులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - old students get to gether in unguturu news
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు, భీమడోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు.. ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. తమ కళ్లల్లో సంతోషాన్ని.. మదిలో ఆనందాన్ని నింపుకుని.. అలనాటి జ్ఞాపకాలను తలచుకుంటూ.. వారంతా సందడి చేశారు.
ఉంగుటూరు, భీమడోలులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పలకరింపులు, కుశల ప్రశ్నలు, నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దీంతో ఆయా పాఠశాలల ప్రాంగణాల్లో పండగ వాతావరణం నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు.
ఇదీ చదవండి:
గిరిజనుల చేతిలో కొండచిలువ హతం
Last Updated : Jan 17, 2021, 8:57 PM IST