ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దాడికి పాల్పడ్డిన వ్యక్తిని అరెస్టు చేయాలి' - concern in west godavari district

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ వృద్ధుడు ఆందోళనకు దిగాడు. స్థల విషయంలో జరిగిన వివాదంలో తనపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు.

old man protest to demand to take action on ycp leader in thadepalligudem west godavari district
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వృద్ధుడు ఆందోళన

By

Published : Mar 4, 2021, 6:41 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పి.సుబ్బారావు అనే వృద్ధుడు పోలీస్ స్టేషన్ కూడలి వద్ద ఆందోళనకు దిగాడు. స్థలం విషయంలో జరిగిన వివాదంలో తనపై వైకాపాకు చెందిన నాయకుడు దాడి చేసాడని ఆరోపించాడు. ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ... అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టాడు. పోలీస్​స్టేషన్ లో కేసు నమోదు చేసి నేటికి పది రోజులు గడుస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు వాపోయాడు.

ABOUT THE AUTHOR

...view details