ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పాజిటీవ్​ అనుకుని.. ఆందోళనతో వృద్ధుడు మృతి.. - ఏలూరులో కరోనా భయంతో వృద్దుడు మృతి

కరోనా సోకిందేమోనన్న ఆందోళనకు గురై ఓ వృద్ధుడి గుండె ఆగింది. కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేయించుకున్న చోటే కుప్పకూలిపోయారు. పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినా.. అప్పటికే అతను తీవ్ర ఉద్వేగానికి గురై ప్రాణం కోల్పోయారు.

old man dead with corona fear in eluru west godavari district
వృద్ధుడి మృతి
author img

By

Published : Jul 17, 2020, 1:36 PM IST

Updated : Jul 17, 2020, 1:59 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో కోటదిబ్బ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో గురువారం ‘సంజీవని’ బస్సులో చేస్తున్న కరోనా వైద్య పరీక్షలకు టూటౌన్‌ పవరుపేటకు చెందిన కె.అప్పారావు వచ్చారు. పరీక్ష చేయించుకున్న అనంతరం ఫలితం కోసం అక్కడే కూర్చున్నారు. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు కూడా పరీక్షలు చేయించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే అతని కుమారుడు వృద్ధుడి వద్దకు వచ్చి నీకు నెగెటివ్‌ వచ్చిందని చెప్పారు. అప్పటికే తీవ్ర ఆందోళనతో ఉన్న అప్పారావు సరిగా అర్థం చేసుకోలేక పాజిటివ్‌ అనుకున్నారో ఏమో కుప్పకూలిపోయారు. అక్కడున్న 108 సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

Last Updated : Jul 17, 2020, 1:59 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details