ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తాం' - పెదవేగిలో ఆయిల్ ఫెడ్ కమిటీ సమావేశం వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ఏపీ ఆయిల్ ఫెడ్ కమిటీ సమావేశమైంది. దీనిలో ఆయిల్ ఫామ్ రైతుల సమస్యల గురించి చర్చించారు. వారికి గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటామని కమిటీ హామీ ఇచ్చింది.

oil fed committe meeting at pedavegi west godavari district
పెదవేగిలో ఆయిల్ ఫెడ్ కమిటీ సమావేశం

By

Published : May 11, 2020, 7:44 PM IST

ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలు పరిష్కరించి వారికి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫెడ్ రైతుల కమిటీ ఛైర్మన్ కొటారు రామచంద్రరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. జోనల్ విధానానికి వ్యతిరేకంగా ఆయిల్ ఫామ్ గెలల కొనుగోలు, పలు పరిశ్రమలు రైతులకు రవాణా చార్జీలు చెల్లించకపోవడం వంటి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఓఈఆర్, తెలంగాణ ఓఈఆర్​కి వ్యత్యాసంపై తక్షణం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details