ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీఏసీఎస్ నిధుల స్వాహా చేసిన వారిపై క్రిమినల్ చర్యలు - నిధుల స్వాహాలో సూర్యారావుపాలెం పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు, డైరెక్టర్లు, కార్యదర్శి

సూర్యారావుపాలెం వ్యవసాయ పరపతి సంఘంలో 3.86 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో అధికారులు విచారణ చేపట్టారు. పీఏసీఎస్​కు చెందిన మాజీ అధ్యక్షులు, డైరెక్టర్లు, కార్యదర్శి, సేల్స్​మెన్స్ సొంతానికి వాడుకున్నట్లు నిర్ధారించారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

officials going to take action on accused
నిందితులపై చర్యలు తీసుకోనున్న అధికారులు

By

Published : Nov 7, 2020, 10:38 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో.. నిధులు దుర్వినియోగం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. 3.86 కోట్ల రూపాయల అవకతవకలు చోటుచేసుకున్నాయని తెలిపారు. బాధ్యుల ఆస్తులను జప్తు చేసి.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు.

సూర్యారావుపాలెం సహకార సంఘంలో కొత్త పాలకవర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భారీ స్థాయిలో అవకతవకలు ఉన్నట్లు గమనించిన అధికారులు.. సెక్షన్ 51 ప్రకారం విచారణ జరిపారు. ఆ నిధుల్లో 14 లక్షల రూపాయలు రికవరీ చేశారు. మిగిలిన 2.80 కోట్ల రూపాయలను మాజీ అధ్యక్షులు, కార్యదర్శి స్వాహా చేశారని నిర్ధారణకు వచ్చారు. మరో 70 లక్షల రూపాయలను మాయం చేయడంలో డైరెక్టర్ల పాత్ర ఉన్నట్లు తెలిపారు. 22 లక్షల రూపాయలను సంఘంలో పనిచేసే సేల్స్ మెన్​లు సొంతానికి వాడుకున్నారన్నారు.

నిధులను దుర్వినియోగం చేసిన సంఘం మాజీ అధ్యక్షులు మద్దుకూరి శ్రీమన్నారాయణ, కార్యదర్శి కొండపల్లి సుబ్రమణ్యంలతో పాటు ముగ్గురు సేల్స్ మెన్​​ల ఆస్తులను జప్తు చేసినట్లు డివిజనల్ సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సేల్స్ మెన్​లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పాలక వర్గానికి సూచించామని తెలిపారు. మిగిలిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొనే నిమిత్తం.. జిల్లా సహకార అధికారికి నివేదించామని వివరించారు.

ఇదీ చదవండి:ఆరిమిల్లి రాధాకృష్ణ గృహ నిర్బంధం...పోలీసుల తీరుపై తెదేపా ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details