రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం గిట్టుబాటు ధరకి కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దాసి రాజు అన్నారు. దక్కని మద్దతు ధర శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై స్పందించిన ఆయన కలెక్టర్ ఆదేశాల మేరకు దెందులూరు గ్రామానికి వెళ్లి స్థానిక రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిపాటి లోపాలు ఉన్నా మిల్లు యజమానులు ధరలో భారీగా కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ధాన్యం కొనుగోలు చేయమని తీసుకెళ్లి పోవాలంటూ సూచిస్తున్నారని ఆరోపించారు. కొద్దిపాటి లోపాలు ఉన్నా.. ధరల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందని, అయినా అమ్మక తప్పని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. బిల్లులతో సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద శాంపిల్ తీసుకొని వాటిని పరీక్షించి కొనుగోలు చేయటం జరుగుతుందని మేనేజర్ రాజు రైతులకు వివరించారు.
'దక్కని మద్దతు ధర' ఈనాడు కథనానికి కదిలిన అధికారులు - officers respond to eenadu etv artical at west godavari district news
దక్కని మద్దతు ధర శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దాసి రాజు దెందులూరు గ్రామానికి వెళ్లి స్థానిక రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శాంపిల్ తీసుకొని వాటిని పరీక్షించి కొనుగోలు చేయటం జరుగుతుందని తెలిపారు.
రైతులతో మాట్లాడుతున్న పౌర సరఫరాల సంస్థ అధికారులు