మాస్కులు ధరించకపోతే ఏం చేస్తారో తెలుసా..? - corona news west godavari district
కొన్ని నెలలుగా ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలుపుతున్నప్పటికీ... కొందరిలో ఎలాంటి స్పందన కనిపించటం లేదు. ఫలితంగా పశ్చిమగోదావరి జిల్లాలో అధికారులు ప్రత్యక్ష చర్యలు చేపట్టారు.
మాస్కులు ధరించని వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం
పశ్చిమగోదావరి జిల్లాలో ఎవరైనా మాస్కులు ధరించకపోతే క్వారంటైన్, రీలీఫ్ కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. తణుకు పట్టణంలో మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, పోలీసులు బహిరంగా ప్రదేశాలలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఎక్కించి తరలిస్తున్నారు. ఇలా చేస్తేనైనా ప్రజలనుంచి కొంత స్పందన వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలతో మాస్కులు ధరిస్తున్నారు.