పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండల పరిధిలో తరలిస్తున్న అరకిలో బంగారు ఆభరణాలను ఎన్నికల నిఘా అధికారులు పట్టుకున్నారు. కంతేరు సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఈ వ్యవహారాన్ని గుర్తించారు. బంగారానికి సరైన ధృవీకరణ పత్రాలు లేవన్నారు. మద్యం, డబ్బు, ఇతర విలువైన వస్తువులు తరలించకుండా తనిఖీలు చేస్తుండగా సతీష్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై సంచిలో వీటిని పట్టుకున్నట్టు తెలిపారు. నిఘా బృందం అధికారిణి మాధురి ఆభరణాలను స్వాధీనం చేసుకుని వాటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంవీ రమేష్‌కు అప్పగించారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అరకిలో బంగారు ఆభరణాలు స్వాధీనం
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారు ఆభరణాలను ఎన్నికల నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని నిఘా అధికారి మాధురి వెల్లడించారు.
అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారు ఆభరణాలు స్వాధీనం