ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాళ్లను నమ్ముకొని వలస కూలీ ప్రయాణం - odisha, bhihar migrant workers latest news

లాక్​డౌన్​ నేపథ్యంలో సొంతగూటికి వెళ్లేందుకు వలస కూలీలు పడుతున్న బాధలు వర్ణానాతీతంగా ఉన్నాయి. యాజమానులు వెళ్లిపోమ్మనడం.. దిక్కులేని పరిస్థితుల్లో కాళ్లనే నమ్ముకొని కాలినడకన చేస్తుండడం.. చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. చెన్నై లాంటి సుదూర ప్రాంతాల్లో చిక్కుకున్న బీహార్​, ఒడిషా వాసులు ఆంధ్ర మీదుగా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు.

migrant worker
కాళ్లను నమ్ముకొని వలస కూలీ ప్రయాణం

By

Published : May 5, 2020, 5:15 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో సొంతగూటికి చేరుకొనే మార్గం లేక వలస కూలీలు వందల మైళ్ల దూరం నడక సాగిస్తున్నారు. చెన్నై లాంటి ప్రాంతాల్లో చిక్కుకు పోయిన బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఆంధ్రప్రదేశ్ మీదుగా కాలి నడకన తమ ఊళ్లకు వెళ్తున్నారు. పని చేసిన చోట యజమానులు బతకడానికి నగదు ఇవ్వకపోగా వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్న కారణంగా.. వేరే దారి లేక నడక ప్రయాణం సాగిస్తున్నట్లు తెలిపారు.

పనులు లేక లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న వలస కూలీలు తప్పని పరిస్థితిల్లో కాలి నడకనే సొంత గ్రామాలకు బయలుదేరామని ఆవేదన చెందుతున్నారు. వీటికి తోడు షాపులన్నీ మూతపడటం... రహదారి వెంబడి ఎలాంటి ఆహారం అందుబాటులో లేక ఆకలితో అలమటిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details