ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రమబద్ధీకరణకు దరఖాస్తులు..పరిష్కరించేందుకు మీనమేషాలు - పశ్చిమ గోదావరిలో భవనాల క్రమబద్దీకరణ

పట్టణాలు విస్తరించాయి. ఏటా భవన నిర్మాణాలూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా కొందరు, అనుమతులు తీసుకున్నా విస్మరించి మరికొందరు భవనాలు నిర్మిస్తున్నారు. అటువంటి వాటిని భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీపీఎస్‌) ద్వారా సరి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అధికారులూ చొరవ చూపడం లేదు.

applications under BPS
భవనాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు

By

Published : Oct 8, 2020, 10:51 AM IST

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసినవి, రెండంతస్తుల భవనానికి అనుమతులు తీసుకుని ఆపై అదనంగా నిర్మాణాలు చేసినవి, వాస్తుకు అనుగుణంగా అదనపు విస్తీర్ణంలో కట్టడాలు, నాన్‌లేఅవుట్‌లో భవనాలు వంటి వాటిని బీపీఎస్‌లో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది. స్థలం వివరాలు, ఈసీ, ప్రభుత్వ అనుమతులు తీసుకున్న వారైతే నిర్మాణ ప్లాన్‌ను బీపీఎస్‌ పరిష్కార సమయంలో సమర్పించాలి. అనధికారికమైతే ప్రభుత్వ నిబంధనల మేరకు నగదు చెల్లించాల్సి ఉంటుంది.

1985 నుంచి 2018 సెప్టెంబరు నెలాఖరు వరకు నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు జీవో విడుదల చేయగా దాన్ని మూడు నెలలు పొడిగిస్తూ గతేడాది జనవరిలో ఒకసారి.. ఆపై మరో మూడు నెలలు.. అలా జూన్‌ అంటూనే ఈ నెలాఖరుకు గడువు పొడిగించారు.

దరఖాస్తులు వెల్లువ..

2014 డిసెంబరు 31కు ముందు నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని గతంలో కల్పించగా అప్పట్లో జిల్లాలోని పట్టణాల నుంచి 4,635 దరఖాస్తులొచ్చాయి. వాటి పరిష్కారంతో రూ.41 కోట్ల వరకు పురపాలికలకు ఆదాయం సమకూరింది. అక్రమ కట్టడాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. బీపీఎస్‌లో వస్తున్న దరఖాస్తులు వేలాదిగా ఉంటుంటే ఇవేమీ పట్టించుకోకుండా నిర్మాణయ్యేవి రెట్టింపుగా ఉంటాయనే ఆరోపణలున్నాయి.

అక్రమ కట్టడాలను సక్రమం చేసుకోవడం ద్వారా పురపాలికలకు ఆదాయం సమకూరుతుంది. గతంలో ఒక్క భీమవరం పురపాలక సంఘానికే రూ.14 కోట్లకు పైగా వచ్చింది.భీమవరంలో 15, తణుకులో 35 దరఖాస్తులు గత నెలన్నర నుంచి అపరిష్కృతంగా ఉండిపోవడంపై పట్టణ ప్రణాళిక విభాగ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని సమాచారం.

పట్టణాల వారీగా బీపీస్​ దరఖాస్తుల వివరాలు

పరిష్కారంపై దృష్టి:

రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలో ఇప్పటి వరకు 81 శాతం దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగిలిన వాటినీ పరిష్కరింపజేసే దిశగా చర్యలు తీసుకున్నామని రాజమహేంద్రవరం పట్టణ ప్రణాళిక శాఖ ప్రాంతీయ సంచాలకులు, వై.పాండురంగనాయకులు తెలిపారు.

ఇదీ చదవండి: హక్కులు హరించేలా పోలీసు వ్యవస్థ తీరు ఉంది: వర్లరామయ్య

ABOUT THE AUTHOR

...view details