పోరంబోకు భూములు ఇళ్ల స్థలాల ప్రతిపాదనపై భాజపా కిసాన్ మోర్చా అభ్యంతరం - Notification of house placement issue object news
గుంతల భూములు, చెరువు గట్లు, కాలువ గట్లను ఇళ్ల స్థలాలుగా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంపై భాజపా కిసాన్ మోర్చా విభాగం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాట్లాడిన నాయకులు పుంత భూములు, చెరువు గట్లు, కాల్వ గట్లను ఇళ్ల స్థలాలుగా ఇస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.