ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో నిదానంగా నామినేషన్ల ప్రక్రియ - undi latest news

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో తొలివిడత స్థానిక ఎన్నికల నామినేషన్​ ప్రక్రియ నింపాదిగా జరిగింది. సర్పంచ్​ స్థానాలకు ఉండిలో 31, భీమవరంలో 9 నామినేషన్లు దాఖలయ్యాయి.

nominations
నామినేషన్ల ప్రక్రియ

By

Published : Jan 30, 2021, 12:17 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నెమ్మదిగా కొనసాగింది. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద అభ్యర్థుల కోలాహలం నెలకొంది. నామినేషన్ కేంద్రాలకు వంద మీటర్ల లోపు ఎవరూ నినాదాలు, ప్రచారాలు చేయకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు.

పోలింగ్ కేంద్రాలను భీమవరం గ్రామీణ సీఐ శ్యామ్​కుమార్ పరిశీలించారు. సర్పంచ్ స్థానాలకు ఉండి నియోజకవర్గంలో ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాల్లో తొలిరోజు 31 నామినేషన్లు, భీమవరం నియోజకవర్గంలో తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details