ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NIRMALA SEETARAMAN: నర్సాపురంలో శుభకార్యానికి వచ్చిన నిర్మలాసీతారామన్ - ఏపీ తాజా వార్తలు

రాష్ట్రంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చేరుకున్న ఆమె ఓ శుభకార్యంలో పాల్గొన్నారు.

nirmala-sitharaman
nirmala-sitharaman

By

Published : Aug 14, 2021, 9:01 AM IST

Updated : Aug 14, 2021, 10:22 AM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నిర్మలకు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం బయల్దేరి వెళ్లారు. అనధికారిక కార్యక్రమం కావడంతో మంత్రి పర్యటన చివరివరకు బయటకు తెలియలేదు. గతంలో తన వద్ద వ్యక్తిగత పీఏగా పనిచేసిన పేరాల మోహన్ కుమార్తె వివాహానికి ఆమె హాజరయ్యారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఈ వివాహానికి హాజరయ్యారు. నిర్మలాసీతారామన్​ రేపు మధ్యాహ్నం విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లనున్నారు.

ఇదీ చదవండి: ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూములకు ధరాఘాతం.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలపై పిడుగు

Last Updated : Aug 14, 2021, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details