ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. తొమ్మిది మందికి గాయాలు - పశ్చిమగోదావరి జిల్లా నేర వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు రైల్వేస్టేషన్ సమీపంలో 216(ఏ) జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

nine people injured in a road accident at bheemadolu west godavari district
ఆర్టీసీ బస్సు- కారు ఢీ... తొమ్మిది మందికి గాయాలు

By

Published : Mar 8, 2021, 7:55 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు భీమడోలులో ప్రయాణికుల కోసం ఆగింది. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరికి తీవ్రగాయాలు, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details