పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా.. మరో 9 మందికి కరోనా సోకింది. వీరితో కలిపి బాధితుల సంఖ్య... 152కు పెరిగింది. వీరిలో 58 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 94 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 4 రోజులుగా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది.
జిల్లాలో మరో 9 మందికి కరోనా పాజిటివ్.. 152కు పెరిగిన బాధితులు - 152 కరోనా కేసులు
పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 9 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 152కు పెరిగింది.
జిల్లాలో తాజాగా 9పాజిటివ్ కేసులు నమోదు
జిల్లాలో ఇప్పటి వరకు 32, 419 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 28, 952 మందికి నెగిటివ్ అని ఫలితం వచ్చింది. 3315 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా బాధితులు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన అధికారులు.. ప్రజల రాకపోకలు నియంత్రిస్తున్నారు.