ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్టీఆర్ గృహ పథకం ఇళ్లను పూర్తిచేసి పేదలకు ఇవ్వాలి'

తెదేపా హయాంలో చేపట్టిన ఎన్టీఆర్ గృహ పథకం ఇళ్లను పూర్తిచేసి పేదలకు ఇవ్వాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఇప్పుడిస్తున్న సెంటు భూమిని సెంటున్నరగా మార్చాలన్నారు.

nimmala-ramanaidu-on-ntr-gruha-scheme
నిమ్మల రామానాయుడు, తెదేపా ఎమ్మెల్యే

By

Published : Jul 17, 2020, 7:03 PM IST

పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి గత తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ పథకం ప్రవేశపెడితే.. నేడు వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో పేదలకు ఇళ్లను దూరం చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పెదగరువులో ఆగిన ఎన్టీఆర్ గృహ పథకం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

రాష్ట్రంలో 10లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా తెదేపా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నేడు సెంటు స్థలం ఇచ్చి వైకాపా ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఎద్దేవా చేశారు. ఆగిన ఎన్టీఆర్ గృహాలను పూర్తిచేసి పేదలకు అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details