అచ్చెన్నాయుడు లేఖ ఇచ్చిన టెలి మెడిసిన్ విలువ రూ.7.96 కోట్లు మాత్రమే అని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు అన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ టెలిమెడిసిన్ సంస్థకు రూపాయి కూడా చెల్లించలేదని.. పైగా ఈ అంశంపై విచారణకు ఆదేశించినది కూడా తెదేపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ టెలిమెడిసిన్ సంస్థకు సుమారు రూ.3 కోట్లు చెల్లించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని నిమ్మల రామానాయుడు అన్నారు. విచారణ ఎదుర్కొంటున్న ఈ సంస్థకు జగన్ ప్రభుత్వం ఎందుకు చెల్లింపులు చేసిందని ప్రశ్నించారు.
'తెదేపా హయాంలో టెలీమెడిసిన్ సంస్థకు రూపాయి చెల్లించలేదు' - nimmala ramanaidu on achennaidu arrest
తెదేపా ప్రభుత్వ హయాంలో టెలిమెడిసిన్ సంస్థకు రూపాయి కూడా చెల్లించలేదని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు లేఖ ఇచ్చిన టెలి మెడిసిన్ విలువ రూ.7.96 కోట్లు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
అచ్చెన్నాయుడు అరెస్టుపై నిమ్మల రామానాయుడు
కేసు పెట్టాల్సి వస్తే జగన్ ప్రభుత్వంలో చెల్లింపులకు సిఫార్సు చేసిన వైకాపా నేతలపై పెట్టాలన్నారు. రూ.500కోట్లు పైగా కరోనా వస్తువులు నామినేషన్ పై కొన్నందుకు జగన్ ప్రభుత్వంపై ఎందుకు కేసులు పెట్టలేేదని ప్రశ్నించారు.