తెదేపా హయాంలో నిర్మించిన గృహాలను పేదలకు అందించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీ ప్లస్-3 గృహాలను ఆయన పరిశీలించారు. తెదేపా హయాంలో 95 శాతం పూర్తైన ఇళ్లను.. సీఎం జగన్ 13 నెలల కాలంలో పూర్తి చేయలేక పోయారన్నారు. కావాలని వాటి నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
'గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించాలి' - గత ప్రభుత్వహయంలో నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించాలి
గత ప్రభుత్వ హయాంలో పేదలకు మంజూరైన ఇళ్లను పంపిణీ చేయకుండా పనికిరాని స్థలాలు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తెదేపా నిర్మించిన జీ ప్లస్ - 3 గృహాలను ఆయన పరిశీలించారు. వాటిని వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
'గత ప్రభుత్వహయంలో నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించాలి'
రివర్స్ టెండరింగ్ పేరుతో ఇళ్ల నిర్మాణం నిలుపుదల చేశారని.., దీనివల్ల నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇళ్ల కోసం డబ్బు చెల్లించిన ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని ఆక్షేపించారు. పూర్తయిన గృహాలను పేదలకు ఇవ్వకుండా పనికిరాని స్థలాలు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని..వెంటనే లబ్ధిదారులకు గృహాలు పంపిణీ చేయాలని నిమ్మల డిమాండ్ చేశారు.