ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుక్కల్ని తప్పించుకోబోయి.. కాల్వలో పడి మహిళ మృతి - మున్సిపల్‌ ఛైర్మన్‌ భూపతి ఆదినారాయణ భార్య ఆండాలు మరణం

ఉదయం నడక కోసం వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు మృతి చెందారు. నిడదవోలు మున్సిపల్‌ ఛైర్మన్‌ భూపతి ఆదినారాయణ భార్య ఆండాలు వాకింగ్​ చేస్తున్న సమయంలో కుక్కలు వెంటపడటంతో తప్పించుకునేందుకు.. పక్కనే కాల్వ మెట్లు ఎక్కబోయి నీళ్లలో పడి మృతి చెందారు.

municipal chairman wife death
కుక్కల్ని తప్పించుకునే ప్రయత్నంలో మృతిచెందిన మున్సిపల్‌ ఛైర్మన్ భార్య

By

Published : Apr 3, 2021, 4:42 PM IST

Updated : Apr 3, 2021, 4:54 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్‌ ఛైర్మన్‌ భూపతి ఆదినారాయణ భార్య ఆండాలు ప్రమాదవశాత్తు గోదావరి కాల్వలో పడి మృతి చెందారు. ఇవాళ ఉదయం నడక కోసం వెళ్తుండగా.. ఆమెపై కుక్కలు దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కాల్వ మెట్లపైకి దిగారు. ఈ క్రమంలో మెట్ల పైనుంచి జారి కాల్వలో పడిపోయారు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో నీటి ప్రవాహ వేగానికి గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఉండ్రాజవరం కాల్దారి వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం.. పోలీసులు నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Apr 3, 2021, 4:54 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details