"చర్యలపై నివేదిక కోరితే... ప్రతిపాదనలు ఇస్తారేంటి" - mega food park in west godavari news
పశ్చిమ గోదావరి జిల్లాలోని మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌పై దాఖలైన పిటిషన్‌పై ఎన్‌జీటీలో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించటంపై తీసుకున్న చర్యలేంటని ఏపీపీసీబీని ఎన్జీటీ ప్రశ్నించింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘిస్తూ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం చేపట్టారని దాఖలైన పిటిషన్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. ఉల్లంఘనలు నిర్ధరణ కావటంతో మెగాఫుడ్ పార్క్‌కు 29 లక్షల రూపాయల జరిమానా విధించాలనుకున్నట్లు... అందుకు న్యాయ సలహా కోసం వేచి చూస్తున్నట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. తీసుకున్న చర్యలపై నివేదిక కోరితే ప్రతిపాదనలతో ఎందుకు నివేదిక ఇచ్చారని ఏపీపీసీబీని ఎన్జీటి ప్రశ్నించింది. తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించేందుకు సమయం కావాలని పీసీబీ కోరింది. అయితే ఈ పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం, జాతీయ తీర ప్రాంత పర్యవేక్షణ ప్రాధికార సంస్థలు తమ అభిప్రాయాలు తెలియజేయాలన్న ఎన్జీటీ... తదుపరి విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది.