పోలవరం ప్రాజెక్టు, డంప్ యార్డు ఉన్న గ్రామాల్లో నిపుణుల బృందం పర్యటిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం మూలలంకలో ఎన్జీటీ సంయుక్త కమిటీ సభ్యుల బృందం పర్యటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్ధాలకు సంబంధించి మట్టి, కంకర రాళ్లు, నిర్మాణ వ్యర్థాలను కమిటీ పరిశీలించింది. భారీ స్థాయిలో డంప్ చేస్తున్న వ్యర్థాల వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూలలంక డంపింగ్ యార్డ్‌లో ఎలాంటి వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారన్న వివరాలను ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్ వే, కాపర్ డ్యామ్ నిర్మాణాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. రెండు రోజులపాటు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కమిటీ పర్యటిస్తుంది.
పోలవరం మూలలంకలో ఎన్జీటీ సంయుక్త కమిటీ పర్యటన - ploavaram construction latest news
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం మూలలంకలో ఎన్జీటీ కమిటీ పర్యటిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాలు, డంపింగ్ యార్డు పరిశీలిస్తున్నారు.
రేపు పోలవరం మండల కేంద్రంలో బహిరంగ సభ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారు. మూలలంకలో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న విషయాలపై ప్రజాభిప్రాయం కోరతారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాల వల్ల పర్యావరణానికి ప్రజలకు తీవ్ర హాని కలుగుతుందని పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆరు మందితో కూడిన సంయుక్త కమిటీని నియమించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్న విషయాలపై ఈ కమిటీ నివేదిక అందిస్తుంది. ఏప్రిల్ 2న రాజమహేంద్రవరంలో ఈ నివేదికను మీడియా ముందు వెల్లడించే అవకాశం.
ఇదీ చదవండి: ఏప్రిల్ 1న కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్