West Godavari District Crime news: పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే.. నవ వధువు గోదావరిలో దూకి గల్లంతైంది. ఆమెకు ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు గానీ.. పెళ్లయిన ఏడో రోజులకే ఈ అఘాయిత్యానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
పుట్టింటికి వచ్చిన వదువు.. అంతలోనే..
ఈనెల 20న.. పట్టిసీమ గ్రామానికి చెందిన కరిబండి అనురాధకు, కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన శివప్రసాద్‌తో వివాహమైంది. వీరికి పెళ్లి జరిగి కేవలం ఏడు రోజులే గడిచాయి. ఈ క్రమంలో పుట్టింటికి వచ్చిన అనురాధ.. ఉదయాన్నే గోదావరి నది వద్దకు వెళ్లింది. చూస్తుండగానే గోదావరిలో దూకినట్లు అక్కడ ఉన్న జాలర్లు తెలిపారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పరిగెత్తుకెళ్లిన కుటుంబ సభ్యులు గోదావరిలో వెతికినా ప్రయోజనం లేకపోయింది.