కొత్తగా ఓటుహక్కు నమోదుకు ఈసీ ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. 2020వ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు పొందడానికి అర్హులని ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 9,200 మంది యువతీ యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు అన్నిటిని ఫిబ్రవరి మూడో తేదీ నాటికి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తారు. ఫిబ్రవరి ఏడో తేదీ నాటికి ఓటర్ల జాజితాను నిర్ధరిస్తారు. ఫిబ్రవరి 14వ తేదీన ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. కొత్తగా ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
ముగిసిన ఓటరు నమోదు ప్రక్రియ - voter entering session in closed in west godavari
కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు తేదీ మంగళవారంతో ముగిసింది. అర్హత కలిగిన యువతీ యువకులు ఓటు హక్కు పొందేందుకు గత నెల 23వ తేదీ నుంచి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ముగిసిన ఓటర్ జాబితా నమోదు ప్రక్రియ
TAGGED:
ముగిసిన ఓటర్ జాబితా నమోదు